News November 21, 2025
తిరుపతి: హనుమంతుడిపై బుల్లి రామయ్య

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో బుల్లి రామయ్యను హనుమంతుడు మోస్తున్న సన్నివేశం భక్తులను మైమరపించింది. వాటితోపాటు మాడ వీధుల్లో కోలాటం ఆడిన శ్రీనివాసుడు, రాధా కృష్ణ వేషధారణలు అలరించాయి.
Similar News
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 21, 2025
బీఎస్ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్ ఎంటర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్‌లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్‌లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
News November 21, 2025
NRPT: స్థానిక ఎన్నికలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.


