News March 19, 2025
తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
Similar News
News February 22, 2026
మరో రెండు రోజుల్లో ఇరాన్‌పై అమెరికా దాడి?

ఇరాన్‌పై మరో రెండు రోజుల్లో అమెరికా దాడి చేసే అవకాశం ఉందని CIA మాజీ అధికారి జాన్ కిరియాకౌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై US ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. ఇరాన్‌కు 10రోజుల గడువు ఇవ్వడం కేవలం దృష్టి మరల్చడానికేనని అన్నారు. అమెరికా సైన్యం కదలికలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలు అప్రమత్తమయ్యాయి.
News February 22, 2026
BREAKING: భారత్ బౌలింగ్.. టీమ్ ఇదే

T20WC సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ, సుందర్, అర్ష్‌దీప్, బుమ్రా, చక్రవర్తి
SA: మార్క్రామ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, ఎంగిడి
News February 22, 2026
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లాలో సోమవారం నుంచి జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.


