News June 29, 2024
తిరుపతి- హిసార్ మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి- హిసార్ మధ్య వారానికోసారి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. హిసార్- తిరుపతి (04717) రైలు ప్రతి శనివారం జులై 6 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు, తిరుపతి- హిసార్ (04718) రైలు ప్రతి సోమవారం జులై 8 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నడవనున్నాయి. గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ ఖాఘజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ తదితర స్టేషన్ల మీదుగా వెళుతుందని చెప్పారు.
Similar News
News January 29, 2026
చిత్తూరులో బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల

చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 మద్యం బార్లను ఏర్పాటు చేయడానికి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రీ-నోటిఫికేషన్ జారీ చేశారు. రెండేళ్ల పాటు లైసెన్సు జారీ చేస్తామని, ఆసక్తి ఉన్న వ్యాపారులు వచ్చేనెల 4 సాయంత్రం 6 గంటల లోపు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 5న కలెక్టరేట్‌లో లక్కీడిప్ ద్వారా లైసెన్స్‌లే ఎంపిక చేస్తామన్నారు.
News January 29, 2026
చిత్తూరులో కేంద్రీయ విద్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభం

చిత్తూరు జిల్లా మంగసముద్రంలో కొత్త కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026–27 విద్యా సం. నుంచి ఈ విద్యాలయం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఎదురుగా తాత్కాలిక భవనాల్లో I నుంచి Vవ తరగతి వరకు బోధన ప్రారంభమవుతుంది. భూమి బదిలీ పూర్తికావడంతో అడ్మిషన్లను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.
News January 28, 2026
అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.


