News March 15, 2026
తిరుపతి: హోటల్స్‌లో డొమెస్టిక్ వినియోగం..!

యుద్దం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు తారాస్థాయికి చేరాయి. తిరుపతిలో చిన్నపాటి హోటల్స్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారు. దీంతో డొమెస్టిక్ గ్యాస్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Similar News
News April 13, 2026
అనకాపల్లి: నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ తేజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30- 1:30 గంటల వరకు నం.8688400499కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అనకాపల్లి, విశాఖ,అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 13, 2026
పెరిగిన క్రూడాయిల్ ధరలు!

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 8.36% ఎగసి 103 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద కొనసాగుతున్నాయి. యురోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓ దశలో 18% పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు <<19635574>>నిలిపేస్తామని<<>> US హెచ్చరించడంతో క్రూడ్ ధరలు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.
News April 13, 2026
కోనసీమలో 2400 ఏళ్ల నాటి అద్భుతం.. ఏంటో తెలుసా?

కోనసీమలో బౌద్ధం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి అదుర్రు గ్రామమే నిదర్శనం. ఇక్కడి మహాస్థూపం సుమారు 2400 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాఖ తవ్వకాల్లో తేలింది. మౌర్య చక్రవర్తి అశోకుని కుమార్తె సంఘమిత్ర.. శ్రీలంకకు వెళ్లే మార్గంలో ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఈ స్థూపానికి పునాది వేసింది. సాంచి, సార్నాథ్ తర్వాత ముఖ్యమైన స్థూపాలలో ఒకటిగా అదుర్రు గుర్తింపు పొందింది.


