News December 26, 2025
తిరుపతి: 104లో ఉద్యోగాలు

తిరుపతి జిల్లాలో 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డ్రైవర్‌కు 10వ తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం- 25WPM, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని డీఎల్వో ఆఫీసులో ఈనెల 27, 28వ తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.
Similar News
News December 30, 2025
వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.
News December 30, 2025
ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్

AP: ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.
News December 30, 2025
మైనారిటీలపై మీ రికార్డు చూసుకోండి.. పాక్‌కు ఇండియా కౌంటర్

ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది. మైనారిటీల విషయంలో పాక్ అధ్వాన రికార్డు అందరికీ తెలుసని ఎద్దేవా చేసింది. ‘వివిధ మతాలకు చెందిన మైనారిటీలను పాక్ దారుణంగా, ప్లాన్ ప్రకారం బాధితులుగా మారుస్తుందనేది నిజం. మా వైపు వేలు చూపించినంత మాత్రాన అదేమీ మారదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.


