News May 7, 2024

తిరుపతి: 26 మందికి షోకాజ్ నోటీసులు జారీ

image

పీఓ, ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 26 మందికి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండో విడత శిక్షణ తరగతులలో మొత్తం 4524 మందికి PO, APO శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆర్డర్లు పంపారు. అందులో 4498 మంది హాజరయ్యారని, 26 మంది ఏ విధమైన కారణం చూపకుండా శిక్షణకు గైర్హాజరు అయ్యారన్నారు. వారికి షోకాజ్ నోటీసులు పంపించినట్లు చెప్పారు.

Similar News

News September 30, 2024

పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చి వేత

image

మొలకలచెరువులో పోలీస్ క్వార్టర్స్ స్థలం ఆక్రమించి అక్రమంగా కట్టిన ఇళ్లను ఆదివారం కూల్చి వేశారు. సీఐ రాజారమేష్ కథనం.. ములకలచెరువు పోలీస్ క్వార్టర్స్‌కు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్థానికంగా ఉన్న కొందరు అక్రమంగా కబ్జా చేసి ఇళ్లను నిర్మించారు. రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ స్థలంలో సర్వే నిర్వహించి ఆక్రమణలపై నోటీసులు జారీచేసి కట్టడాలు కూల్చేశారు.

News September 29, 2024

SVU : LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో 3/ 5 LLB ( NON – CBCS) 6, 9 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 29, 2024

చిత్తూరు: జిల్లా ప్రజలకు గమనిక.

image

అక్టోబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు లబ్ధి దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో 2,69,677 మందికి సుమారు రూ.113.77 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 1వ, 3వ తేదీలలో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని,అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినంతో 3 వ తేదీ పంపిణీ చేస్తామని చెప్పారు.