News August 29, 2025
తిరుపతి: 31న టెన్నికాయిట్ జట్ల ఎంపిక

తిరుపతి జిల్లా టెన్నికాయిట్ సీనియర్, జూనియర్, బాల, బాలికల జట్లు ఎంపిక ఈనెల 31న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండి శ్యామసుందరరావు తెలిపారు. నాయుడుపేట జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఎంపికలు జరుగుతాయని చెప్పారు. జూనియర్ విభాగంలో తలపడే విద్యార్థులు 2007 జనవరి 1న, ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు.
Similar News
News August 29, 2025
మెదక్: ఫోటోలు, సెల్ఫీ సమయంలో జాగ్రత్త: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవాహాల దగ్గరగా వెళ్లి చూడటం, వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీయడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు హెచ్చరించారు. సెల్ఫీ మోజు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 29, 2025
HYD: హైడ్రా చర్యలను కొనియాడిన హై కోర్టు

రోడ్ల ఆక్రమణలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ప్రయత్నాలను హై కోర్టు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి కొనియాడారు. రాంనగర్ క్రాస్‌రోడ్స్ వద్ద రోడ్ల ఆక్రమణలపై దాఖలైన PIL విచారణ సందర్భంగా ప్రజా రోడ్లు, పార్కులను కాపాడటంలో హైడ్రా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అధికారులు, ప్రజల ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు.
News August 29, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాడబలిజ మత్స్యకారులు, ప్రమాద బాధితులు, ఉద్యోగం కోరిన దివ్యాంగులు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక సమస్యలు వివరించిన పౌరుల అభ్యర్థనలను విని మంత్రి స్పందించారు.