News February 7, 2025
తిరుపతి: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్‌లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.
Similar News
News February 28, 2026
కాకినాడలో భారీ పేలుడు.. హుటాహుటిన బయలుదేరిన హోంమంత్రి అనిత

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
News February 28, 2026
కర్నూలు: ‘ఏప్రిల్ నాటికి 23,077 గృహాలకు సోలార్’

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలోని 23,077 ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏప్రిల్ నాటికి సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్వర్టర్లు, మీటర్లు, ఎర్త్ వైరింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
News February 28, 2026
సిద్దిపేట నుంచే కవిత కొత్త పార్టీ?

సిద్దిపేట కేంద్రంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సిద్దిపేటలో పార్టీ కార్యాలయం, నివాసం ఏర్పాటుకు స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


