News February 20, 2026

తిరుపతి: 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

తిరుపతిలోని SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.250, SC,ST, PwBDలకు రూ.200. వెబ్‌సైట్: https://tirupati.ap.gov.in/

Similar News

News February 21, 2026

భగవంతుడితో ఆటలా? అందుకే YCPకి ఈ గతి: ప్రత్తిపాటి

image

భగవంతుడితో ఆటలు ఆడినందుకే YCP పతనానికి బాటలు పడ్డాయని MLA ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమనే పచ్చని పైరుకు వైసీపీ ఒక చీడ పురుగు లాంటిదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కోసం మొండికేస్తూ జగన్ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని, శాసనమండలిని కూడా తన దిగజారుడు రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 21, 2026

ఇక గురుకులాల్లో తనిఖీలు

image

TG: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇకపై గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలను ఆకస్మికంగా సందర్శించాలని, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.