News March 1, 2025
తిరుపతి: CC కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఇంటర్ ప్రథమ సం.లో 32,213 మంది, ద్వితీయ సం.లో 30,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కోట(M) అంబేడ్కర్ గురుకులం సెంటర్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
సీఎం సదస్సులో నంద్యాల కలెక్టర్

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సదస్సు సోమవారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ రాజకుమారి గణియా సూచనలు చేశారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించారు.
News September 15, 2025
శ్రీకాకుళం: కలెక్టర్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 81 అర్జీలు స్వీకరించామన్నారు. ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉన్నారు.
News September 15, 2025
అనంత: పోలీస్ గ్రీవెన్స్‌కు 121 అర్జీల రాక

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు అనూహ్య స్పందన లభించినట్లు SP జగదీశ్ పేర్కొన్నారు. మొత్తం 121 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేకు 334 అర్జీలు వచ్చాయని జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు.