News August 15, 2025
తిరుపతి IITలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 25.
Similar News
News August 15, 2025
వరంగల్: ‘స్వేచ్ఛ’ కోసం రూ.12 వేలు..!

స్వతంత్రోద్యమంలో వరంగల్ జిల్లాకు సైతం ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 1945 ఫిబ్రవరి 5న మహాత్మా గాంధీ వరంగల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారీ స్థాయిలో వచ్చిన ప్రజలు ఆనాడు స్వతంత్ర ఉద్యమానికి అక్కడికక్కడే దాదాపు రూ.12 వేలు సమీకరించి ఉద్యమానికి నిధిగా గాంధీజీకి అందించారు. గాంధీజీ రాక గుర్తుగా ఎలాంటి స్మృతులు లేకపోవడం బాధాకరమని స్థానికులు చెబుతారు.
News August 15, 2025
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ LOGO మార్పు!

KNR పోలీస్ కమిషనరేట్ లోగోను మార్చినట్లు CP గౌస్ ఆలం తెలిపారు. కొత్త లోగోను మార్చాలన్న ఉన్నతాధికారుల సూచన మేరకు ఆయన దీనిని గురువారం ఆవిష్కరించారు. శాంతి భద్రతల సంరక్షణలో నిబద్ధతను సూచించేలా ఈ లోగోను రూపొందించారు. WHO DARES WINS (ధైర్యం చేసేవాడే గెలుస్తాడు) అనే క్యాప్షన్‌తో ఈ సరికొత్త లోగోను డిజైన్ చేశారు. అశోక చక్రం, నాలుగు సింహాల చిహ్నం దేశభక్తిని, శక్తిని, ప్రజల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
News August 15, 2025
మంగళగిరిని అమరావతి జిల్లాలో కలిపే నిర్ణయం సరైనదేనా?

ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే. అమరావతి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమరావతి జిల్లాలో తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉంటాయని ప్రచారం. మంగళగిరి నియోజకవర్గంని అమరావతి జిల్లాలో కలపడం మంగళగిరి అభివృద్ధికి లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు.