News October 14, 2024

తిరుపతి IIT ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2024 సంవత్సరానికి PhD, M.S(రీసెర్చ్) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ గడువును అక్టోబర్ 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఐఐటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఇతర వివరాలకు www.iittp.ac.in చూడండి.

Similar News

News November 4, 2025

చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.

News November 4, 2025

చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

image

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”‌కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.

News November 4, 2025

పుంగనూరులో విషాదం

image

గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందిన ఘటన పుంగనూరులో జరిగింది. పురుషోత్తం శెట్టి(75), రాధాకృష్ణయ్య శెట్టి(67) సోదరులు. పురుషోత్తం శెట్టికి పిల్లలు లేరు. వీరు ఉమ్మడిగా ఉంటూ బజారు వీధిలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నిన్న రాధాకృష్ణయ్య బాత్ రూములో జారి పడిపోయారు. సాయం చేయడానికి వెళ్లిన పురుషోత్తంశెట్టికి డోర్ తగిలి గాయపడ్డాడు. రాధాకృష్ణయ్య శెట్టి ఇంట్లో, పురుషోత్తంశెట్టి ఆసుపత్రిలో మృతిచెందాడు.