News October 10, 2025
తిరుపతి: PG ఫలితాలు వచ్చేశాయ్.!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో (పీజీ) PG M.A హిస్టరీ, M.Sc బాటని/బయో కెమిస్ట్రీ/ జియాలజీ/ జువాలజీ/ బయోటెక్నాలజీ/ అంత్రపాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
Similar News
News October 10, 2025
ఖమ్మం: ఎన్నికలకు బ్రేక్.. ఆశావహుల కలలు ఆవిరి

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 42% రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేయాలనుకున్న ఉమ్మడి జిల్లాలోని బీసీ ఆశావహుల కలలు ఆవిరయ్యాయి. దీంతో బీసీలకు నిరాశే మిగిలిందని తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలతో జిల్లా అధికారులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (ఎంసీసీ) ఎత్తివేశారు. ఇక కొత్త నోటిఫికేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.
News October 10, 2025
జడ్చర్ల: వృద్ధ దంపతులను రక్షించేందుకు అధికారుల చర్యలు

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామపంచాయతీ అంబఠాపూర్ ఆమ్లెట్ గ్రామానికి చెందిన తానేం బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు వాగు దాటే సమయంలో గల్లంతైన విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, తహశీల్దార్ నర్సింగ్ రావు గురువారం రాత్రి 10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
News October 10, 2025
NGKL: ఎన్నికలు వాయిదా.. అయోమయంలో నాయకులు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. నామినేషన్లు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పిటిసి, 115 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు చేపట్టారు. అంతలోనే ఎన్నికలు వాయిదా పడడంతో నేతలు కంగు తిన్నారు.