News January 26, 2025
తిరుపతి: PHOTO OF THE DAY

తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద వెలసిన శ్రీవకుళ మాత ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలోని మేఘాలు నారింజ రంగు వర్ణంలో ప్రకాశిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారి మాతృమూర్తి వకుళ ఆలయంపై వియ్యంకుడు ఆకాశరాజు ఇలా విచ్చేశాడా అన్నంత అందంగా ఉండటంతో ఆ సుందర మనోహర దృశ్యాలను భక్తులు, స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.
Similar News
News January 11, 2026
సొరకాయ జ్యూస్ తాగుతున్నారా?

సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు జాగ్రత్త అవసరమని ICMR హెచ్చరించింది. ఇటీవల చేదుగా ఉన్న జ్యూస్ తాగి ఢిల్లీలో ఒకరు, UPలో ఇద్దరు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిపుణులు పరిశీలించి టెట్రాసైక్లిక్ ట్రైటెర్పినాయిడ్ అనే విష పదార్థాల వల్లే సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ విషానికి ప్రత్యేకంగా విరుగుడు లేదని తెలిపారు. దీంతో ఎక్కువ చేదుగా ఉన్న సొరకాయ జ్యూస్ తాగకూడదని అధికారులు సూచించారు.
News January 11, 2026
పురుగు మందుల పిచికారీ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పురుగు మందులను పంటపై పిచికారీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ముక్కు, కండ్లకు మందు తాకకుండా హెల్మెట్ లాంటిది తప్పనిసరిగా ధరించాలి. మందును కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో నీళ్లు తాగడం, బీడీ, సిగరెట్ కాల్చకూడదు. పురుగు మందుల పిచికారీ తర్వాత స్నానం చేశాకే తినాలి. మందును గాలి వీచే వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు. సాధ్యమైనంత వరకు గాలి, ఎండ ఉన్న సమయంలోనే స్ప్రే చేయడం మంచిది.
News January 11, 2026
గండికోటలో నేటి నుంచే..!

గండికోట ఉత్సవాలు నేటి నుంచి 3రోజులు జరగనున్నాయి. హెలికాప్టర్ రైడ్స్, పెన్నా నదిలో బోటింగ్ ఉంది. మంగ్లీ, రామ్ మిరియాల సాంగ్స్‌తో, శివమణి డ్రమ్స్‌తో ఉర్రూతలూగించనున్నాయి. భక్తి గీతాలు, గ్రామీణ కళలు, సంప్రదాయ కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి. వీటితో పాటు ప్రాచీన గండికోట కోట, మాధవరాయ స్వామి ఆలయం, ఎర్రరాతి బురుజులు. సూర్యోదయం, సూర్యాస్తమయంలో అక్కడి దృశ్యాలు చూసేయండి.


