News February 3, 2025

తిరుపతి: PIC OF THE DAY 

image

కులమతాలకు అతీతంగా శ్రీకాళహస్తిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మతసామరస్యానికి అతీతంగా ఓ ముస్లిం మహిళ వసంత పంచమి రోజున తన బిడ్డకు మఠాధిపతి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించింది.  హిందూ, ముస్లిం ఐక్యతకు ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. 

Similar News

News March 27, 2026

వరంగల్‌లో హోటళ్ల మూత..!

image

అంతర్జాతీయ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోటల్ రంగం కుదేలవుతోంది. యుద్ధ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరగడం, పర్యాటక ఆధారిత హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బ్రేక్‌ఫాస్ట్ ధరలను పెంచిన యాజమాన్యాలు, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సేవలను నిలిపివేశాయి. ట్రై సిటీ పరిధిలోని దాదాపు 1,100 హోటళ్లు మరో వారం రోజుల్లో పూర్తిగా మూతపడే ప్రమాదం కనిపిస్తోంది.

News March 27, 2026

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

వాట్సాప్ సూపర్ ఫీచర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత, గ్రూప్ చాట్స్(ఫొటోలు, వీడియోలు సహా), కాల్ హిస్టరీ, కమ్యూనిటీస్, వాట్సాప్ ఛానల్ అప్డేట్స్‌ను మరో ప్లాట్‌ఫామ్‌లోకి మార్చుకొనే వీలు కల్పించింది. అంటే మరో వాట్సాప్‌/ఇతర మెసేజింగ్ యాప్స్‌కు సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల స్టోరేజీ ఇబ్బంది ఉండదు. ఇకపై ఐఫోన్‌లోనూ 2 అకౌంట్లు వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ మధ్య చాట్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

News March 27, 2026

HNK: కోతుల నుంచి తప్పించుకుంటుండగా వ్యక్తి మృతి

image

జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాకలో విషాదం నెలకొంది. కోతుల గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి తడక కరుణాకర్(51) అనే ఎల్ఐసీ ఏజెంట్ దుర్మరణం చెందారు. శుక్రవారం తన ఇంటి పైఅంతస్తులో ఉండగా ఒక్కసారిగా కోతులు మీదకు రావడంతో, వాటి నుంచి తప్పించుకోబోయి అదుపుతప్పి కిందపడ్డారు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.