News January 23, 2026

తిరుపతి: SC, STలకు గమనిక

image

SC, ST సమస్యలపై తిరుపతి కలెక్టేరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పోలీస్, అటవీ శాఖతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. అర్జీలను డైరెక్ట్‌గా కలెక్టర్‌కు సమర్పించవచ్చు.

Similar News

News January 30, 2026

కోదాడ: ఘోరం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

కోదాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి వివరాల ప్రకారం.. 2వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో 22 ఏళ్ల యువకుడు అత్యాచారాయత్నానికి పాల్పడగా ఏడవడంతో వదిలేసి వెళ్లాడు. తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పగా పోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News January 30, 2026

కృష్ణా: ఫొటోలు, వీడియోల కౌన్సెలింగ్‌కి నేరాలు మానేస్తారా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆదివారం రౌడీషీటర్లకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ కేవలం ఫొటోలకే పరిమితమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో కేసులున్నా, బెయిల్‌పై వచ్చి మళ్లీ దాడులు, సెటిల్‌మెంట్‌లకు తెగబడుతున్నారు. రాజకీయ అండదండలతో కొందరు బరితెగిస్తుంటే, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. UP తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News January 30, 2026

కొబ్బరి సాగు.. ఈ రకాలతో అధిక దిగుబడి, ఆదాయం

image

కొబ్బరి సాగుకు గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు, నీటి సదుపాయం, మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు అనుకూలం. ఈస్ట్‌కోస్ట్ టాల్, గౌతమి గంగ, డబుల్ సెంచరీ, గోదావరి గంగ వంటి సాధారణ రకాలతో పాటు వైనతేయ గంగ, వశిష్ట గంగ, అభయ గంగ వంటి హైబ్రిడ్ రకాలు అధిక దిగుబడి, ఆదాయాన్ని అందిస్తాయి. ఈ రకాల ప్రత్యేకతలు, దిగుబడికి సంబంధించి పూర్తి సమాచారానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.