News December 13, 2025
తిరుపతి: SVకాలేజీలో అన్యమత ప్రచారం.. ప్రిన్సిపల్ ఏమన్నారంటే.!

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో <<18550600>>అన్యమత ప్రచారం<<>>పై Way2Newsలో వచ్చిన కథనంపై ప్రిన్సిపల్ వై.ద్వారకానాథ్ రెడ్డి స్పందించారు. సంబంధిత లెక్చరర్ నుంచి వివరణ తీసుకున్నామన్న ఆయన.. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు.
Similar News
News December 17, 2025
వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్‌లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
NRPT: మూడో విడత.. @1 గంట వరకు పోలింగ్ శాతం

జిల్లాలో 3వ విడత GPఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ వివరాలను అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో మొత్తం 1,52,648 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 1 గంట వరకు 1,22,307 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.12% నమోదు అయింది. కృష్ణలో 78.18%, మాగనూర్‌లో 84.17%, మక్తల్‌లో 81.76%, నర్వలో 88.35%, ఊట్కూర్‌లో 72.42 శాతం.
News December 17, 2025
జనగామ: 83.27 శాతం పోలింగ్ @1PM

జనగామ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 83.27 శాతం పోలింగ్ నమోదయింది. పాలకుర్తిలో 80.06 శాతం, దేవరుప్పులలో 87.64 శాతం, కొడకండ్లలో 83.39 శాతం నమోదయింది.


