News February 4, 2025
తిరుపతి SVU దగ్గర 144 సెక్షన్
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికారులకు సవాల్‌గా మారింది. నిన్ననే ఎన్నిక జరగాల్సి ఉండగా.. కోరం లేక వాయిదా పడింది. తమ కార్పొరేటర్ల బస్సుపై దాడి చేశారంటూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. కార్పొరేటర్ల బస్సుకు భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరికాసేపట్లో ఎస్వీయూ దగ్గరకు కార్పొరేటర్లు రానున్నారు. ఈ నేపథ్యంలో SVU దగ్గర 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు.
Similar News
News February 4, 2025
కేసీఆర్ కుటుంబానికి ప్రధాని సానుభూతి
TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News February 4, 2025
KMR: ట్రాక్టర్ బోల్తా ఆరుగురికి గాయాలు
బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో మంగళవారం కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం కట్టెలు తీసుకొని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News February 4, 2025
బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.