News December 12, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News December 12, 2025

పీలేరు హైవేపై ఘోర ప్రమాదం.. మహిళ దుర్మరణం

image

పీలేరు మండలం వేపుల బైలు పంచాయతీ వద్ద కొత్తగా వేసిన హైవేపై జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మదనపల్లి నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు రోడ్డు దాటుతున్న వనజ (40)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వనజను కారు డ్రైవర్ సెల్వం, బంధువులతో కలిసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పీలేరు ఎస్ఐ లోకేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 12, 2025

NRPT: ఎంపీ నిధులతో ప్రతి గ్రామానికి 10 లక్షలు – డీకే అరుణ

image

గ్రామాల అభివృద్ధి కోసం డబ్బులకు లోనుకాకుండా ఓటు వేయాలని కోరారు. NRPTలో శుక్రవారం పాలమూరు ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు అందిస్తోందని, ఎంపీ నిధుల ద్వారా ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు.

News December 12, 2025

NRPT: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

image

జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల ర్యాండమైజేషన్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ర్యాండమైజేషన్ ద్వారా అధికారులకు విధులను అప్పగించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.