News August 27, 2025
తిరుపతి TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా శ్రీధర్ వర్మ?

తిరుపతి TDP పార్లమెంట్ అధ్యక్షుడిగా బి.శ్రీధర్ వర్మ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. జోన్-4 మీడియా కోఆర్డినేటర్‌గా విస్మృత సేవలు అందించిన ఆయనకు జిల్లాలోని ఎక్కువమంది ఎమ్మెల్యేలు, నేతల మద్దతు లభించినట్లు తెలుస్తోంది. నిన్న మంత్రి సబితా నేతృత్వంలో జరిగిన కమిటీ సమావేశంలో పలువురు ఆశావాహులు బయోడేటాలు సమర్పించగా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
Similar News
News August 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 65 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 65 MM నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. అత్యధికంగా కొమరాడలో 11.4, అత్యల్పంగా సీతంపేటలో 1.0 MM వర్షం పడిందన్నారు. జియ్యమ్మవలసలో 2.8, భామినిలో 7.4, వీరఘట్టంలో 4.4, పాలకొండలో 4.6, గుమ్మలక్ష్మీపురంలో 2.4, కురుపాంలో 4.4, పార్వతీపురంలో 1.2, సాలూరులో 2.2, పాచిపెంటలో 4.2, మక్కువలో 8.0, సీతానగరంలో 4.4, బలిజిపేటలో 3.6 మిల్లీమీటర్ల.వర్షపాతం నమోదైందన్నారు.
News August 27, 2025
VJA: ఒక్క క్లిక్‌తో దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు

అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలోని నందమూరినగర్‌కు చెందిన ఓ యువకుడు సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ నెల 22న అతనికి వాట్సాప్‌లో ఒక ఈ-చలాన్ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో అతని క్రెడిట్ కార్డు నుంచి 3 విడతల్లో మొత్తం రూ47,097, రూ.65,777 నగదు కట్ అయ్యాయి. దీంతో అతను వెంటనే తన కార్డును బ్లాక్ చేయించాడు. లింక్ క్లిక్ చేయడం వల్ల అతని ఫోన్ సైబర్ కేటుగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.
News August 27, 2025
ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.