News July 24, 2024
తిరుపతి: TTD బోర్డు రద్దు
TTD బోర్డు రద్దయింది. 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో మెంబర్లతో కూడిన బోర్డును గత YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం రావడంతో TTD ఛైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇప్పుడు 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాల ఆమోదంతో TTDకి కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుంది.
Similar News
News January 12, 2025
రేపు PGRS రద్దు: చిత్తూరు ఎస్పీ
చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ DPRO కార్యాలయంలో రేపు నిర్వహించాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం భోగి పండుగ సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
తిరుమల పరకామణిలో దొంగతనం
తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.