News January 26, 2025
తిరుపతి: TTD రూ.27 లక్షల పరిహారం చెల్లింపు

తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు శనివారం అందజేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు. మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్‌ను అందించారు.
Similar News
News March 14, 2025
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషం వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీని జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
News March 14, 2025
SPMVV : ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏడాది జనవరిలో (M.B.A) మీడియా మేనేజ్మెంట్ మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి నెలలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు మహిళ యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News March 14, 2025
MLG: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

ములుగుల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI