News December 24, 2025
తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, వాటిని తిరుమలకు తీసుకొచ్చిన భక్తులపైనా కేసులు నమోదు చేస్తాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.
Similar News
News December 29, 2025
యాదాద్రి కొండపైకి ఉదయం 3.30ని.ల నుంచి ఉచిత బస్సు సౌకర్యం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానికులకు, భక్తులకు కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం గం.3.30ని.ల నుంచి సాయంత్రం 6:00 వరకు వైకుంఠ ద్వారం నుండి కొండపైకి చేరుకొనుటకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే స్థానికులకు సాయంత్రం 3:30లకు అంతరాలయ దర్శనం కల్పించారు. భక్తులు సద్వినియోగించుకోవాలని కోరారు.
News December 29, 2025
మంచిర్యాల: ఆడుకోవద్దన్నందుకు విద్యార్థి సూసైడ్

ఆటలు ఆడుకునేందుకు వెళ్లవద్దన్నందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దండేపల్లి మండలానికి చెందిన శ్రీదేవి-నారాయణ దంపతుల చిన్న కుమారుడు ఆకర్ష్ సోమవారం స్నేహితులతో ఆడుకునేందకు వెళ్తుంటే తల్లి అడ్డుచెప్పింది. ఆటలు మానేసి చదువుకొమ్మని చెప్పినందుకు మనస్తాపంతో ఆకర్ష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News December 29, 2025
ఖమ్మం: కబ్జాదారులకు పొంగులేటి వార్నింగ్

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలను గుర్తించి వెంటనే నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే ఖాళీ చేయించి భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వివాదాల్లో ఉన్న భూముల రక్షణకు న్యాయపరంగా గట్టిగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు.


