News January 1, 2026
తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.
Similar News
News February 14, 2026
DRDOలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

బెంగళూరులో DRDOకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR)11 ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech (CS,IT,ఇన్ఫర్మేషన్ సైన్స్, AI-ML, EC, EEE) ఫైనల్ ఇయర్ చదుతున్నవారు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.5వేల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. టెన్త్, ఇంటర్/డిప్లొమా, BE/BTech సెమిస్టర్ పర్సెంటేజ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in
News February 14, 2026
విరాళాల్లో BJPకి బంపర్ మెజారిటీ.. 82% నిధులు కమలం పార్టీకే!

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఎలక్టోరల్ ట్రస్టులకు వచ్చిన విరాళాల్లో సింహభాగం అధికార BJPకే దక్కింది. మొత్తం ₹3,826 కోట్ల డొనేషన్స్‌లో ₹3,157 కోట్లు (82%) ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లగా కాంగ్రెస్‌కు ₹298 కోట్లు (7.8%) మాత్రమే అందాయి. TMC ₹102 కోట్లు అందుకుంది. టాప్ డోనర్లలో ఎలివేటెడ్ అవెన్యూ రియల్టీ(₹500 కోట్లు), టాటా గ్రూప్ (₹308 కోట్లు), తెలంగాణకు చెందిన మేఘా ఇంజినీరింగ్ (₹175 కోట్లు) ఉన్నాయి.
News February 14, 2026
షాకింగ్ సీక్రెట్: ఇరాన్ ఆందోళనల వెనక అమెరికా ‘డాలర్’ ప్లాన్!

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం వెనక తమ హస్తం ఉందని అమెరికా ట్రెజరీ చీఫ్ స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఆయిల్ ఎగుమతులను అడ్డుకొని బ్యాంకింగ్ రంగాన్ని ఐసోలేట్ చేయడం ద్వారా కావాలనే డాలర్ కొరతను సృష్టించామని తెలిపారు. దీనివల్ల ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ ఏడాదిలో సగానికి పడిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 72% ఎగబాకింది. చివరకు మందులకు కూడా డబ్బుల్లేక ప్రజలు రోడ్లకు మీదకు రావాల్సి వచ్చింది.


