News March 17, 2025
తిరుమల:తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణా సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయించనున్నట్లు తెలిపారు. బుధ,గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించనున్నట్లు ‘X’ వేదికగా టీటీడీ ఛైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
Similar News
News December 29, 2025
పోలీసుల్నే బురిడీ కొట్టించారు.. ₹లక్షలు స్వాహా!

ఆన్లైన్ మోసాల కేసులు చూసే సైబర్ క్రైమ్ పోలీసులే డబ్బు పోగొట్టుకున్నారు. TTD దర్శన టికెట్స్ కోసమని ఓ అధికారి ₹4 లక్షలు కోల్పోయారు. ఇక స్టాక్స్‌లో లాభాలు అని ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయగా మరో ఇన్స్పెక్టర్ ₹39L నష్టపోయారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆ ఆఫీసర్స్ ఇద్దరూ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఈ పోలీసుల అతి నమ్మకం, అత్యాశ తప్ప దొంగల అతి తెలివేం లేదు.
News December 29, 2025
నవీపేట్: అంగన్వాడి సెంటర్లో పేలిన కుక్కర్

నవీపేట్ మండలం రాంపూర్ గ్రామ అంగన్వాడీ సెంటర్లో సోమవారం కుక్కర్ పేలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని రెంజల్ 108 సిబ్బంది లక్ష్మణ్, నయీమ్ ప్రథమచికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల కోసం కుక్కర్లో పప్పు ఉడికిస్తున్న సమయంలో అది పేలి సమీపంలోని ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి. వంట చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను దూరంగా ఉంచాలని గ్రామస్థులు కోరారు.
News December 29, 2025
చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు: భూపాలపల్లి ఎస్పీ

సంక్రాంతి పండగ వేళ నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చైనా మంజాపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మంజా పక్షులకు, మనుషులకు ప్రాణాపాయం కలిగిస్తున్నందున ప్రభుత్వం దీనిపై నిషేధం విధించిందని, నిబంధనలు అతిక్రమించే దుకాణదారులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.


