News November 6, 2025

తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

image

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

Similar News

News November 6, 2025

‘పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా చేయాలి’

image

జిల్లా కోర్టు మీటింగ్ హాల్లో గురువారం న్యాయమూర్తులు,అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడారు. పెండింగ్ కేసుల్లో సాక్షులను కోర్టుల వారీగా త్వరితగతిన తీసుకొని వచ్చి, కేసుల వేగవంతమైన పరిష్కారానికి సహకరించాలని సూచించారు. వారెంట్‌ పెండింగ్‌లో ఉన్న కేసుల్లో వారెంట్‌లను త్వరగా అమలు చేయాలని, చెక్కుబౌన్స్ కేసుల్లో ఫిర్యాదుదారుల సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించారు.

News November 6, 2025

జంట జలాశయాల వద్ద అక్రమ నిర్మాణాలపై పిల్ దాఖలు

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మాధవరెడ్డి ఈ పిల్ దాఖలు చేయగా.. మరొక పిటిషనర్ ఇంప్లీడ్ అయ్యారు. ఈ జలాశయాలు నగరానికి ఎంతో ముఖ్యమని పిటిషనర్ల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News November 6, 2025

సినిమా అప్డేట్స్

image

* సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
* అమన్ కౌశిక్ డైరెక్షన్‌లో విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురాముని పాత్రలో నటిస్తోన్న విక్కీ.. నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
* కల్కి-2లో హీరోయిన్ పాత్ర కోసం ఆలియా, సాయిపల్లవి, అనుష్క, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు తెరపైకి వచ్చాయి.