News August 10, 2024

తిరుమలలో ఆర్జితసేవలు రద్దు: టీటీడీ

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయని టీటీడీ తెలిపింది.

Similar News

News April 5, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.148 నుంచి రూ.154, మాంసం రూ.215 నుంచి 246 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.244 నుంచి రూ.271 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 5, 2026

చిత్తూరు: ఇలా అయితే కొత్త ఇళ్లు కట్టినట్లే.!

image

యుద్ధం నేపథ్యంలో గృహ నిర్మాణ వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. చిత్తూరు జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇనుము టన్నుకు రూ.10 వేలు, సిమెంటు బస్తా రూ.30 మేర పెరిగింది. అలాగే కేబుల్ ధరలు పెరిగిపోయాయి. పీవీసీ పైపుల ధరలు సుమారు 30 శాతం మేర పెరిగాయి. పెయింటింగ్ ధరలను కంపెనీలు పెంచేశాయి. వేసవిలో నిర్మాణ పనులు అధికంగా చేపడతారు. పెరిగిన ధరలు వారిపై భారం మోపునున్నాయి.

News April 5, 2026

హాజరుకాని వారికి నోటీసులు: ZP ఛైర్మన్

image

చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జడ్పీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరవడంతో నోటీసులు పంపించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలన్నారు. మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.