News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
Similar News
News February 11, 2026
VZM: వృద్ధులకు ఊపిరి పోసిన వైద్యులు

తీవ్ర అనారోగ్య సమస్యలతో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ సమస్యలతో మరణానికి చేరువైన ఇద్దరు వృద్ధులను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) వైద్యులు కాపాడారు. పల్మనాలజిస్ట్ వైద్య నిపుణులు బొత్స సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య బృందం వృద్ధులు ఇద్దరికీ వెంటిలేటర్‌పై ఉంచి మెరుగైన చికిత్స అందించడంతో వారు పూర్తిగా కోలుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు.
News February 11, 2026
గుర్రంకొండ: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్ట్

తరిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో టీచర్ జాకీర్ భాషా అసభ్యంగా ప్రవర్తించేవాడు. షీ టీం పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ రాఘవ రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ డి.రవీంద్ర బాబు కేసు నమోదు చేశారు. నిందితుడు గుర్రంకొండ మార్కెట్ వద్ద ఉండగా మంగళవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు .
News February 11, 2026
VJA: బుడమేరు ప్రక్షాళన నిధులెక్కడ?

విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో బుడమేరు ప్రక్షాళన నిధులపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రక్షాళనకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడుతూ, PPP విధానంలో డ్రెయిన్ల నిర్మాణాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారని, ప్రభుత్వం చేపట్టిన పనులను, కేంద్ర సాయం అంశాలను ప్రస్తావించడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి.


