News January 6, 2026
తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు.. కేసు నమోదు

తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు వెలుగు చూసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 1/2026 నంబర్‌తో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. యాదృచ్ఛికంగా పడేశారా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బాటిళ్లు వేసి వైరల్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.
Similar News
News February 16, 2026
MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.
News February 16, 2026
సమష్టి కృషితో జిల్లా ప్రగతి: నల్గొండ కలెక్టర్

నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి 82 వినతులను స్వీకరించారు. కోర్టు కేసులు, కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
News February 16, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అనంతపురం జిల్లాలో 147 కాలేజీలుండగా 64 సెంటర్లు, 18 జోన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో 48,146 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఫస్టియర్‌లో జనరల్ 22,366, ఒకేషనల్ 2,202 మొత్తం 24,568 మంది, సెకండియర్ జనరల్ 1,965, ఒకేషనల్ 21,613 కాగా మొత్తం 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.


