News March 15, 2025
తిరుమలలో ఘోర అపచారం: రోజా

ప్రభుత్వంపై రోజా సంచలన ట్వీట్ చేశారు. ‘పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఘోర అపచారం. ఓ మందుబాబు కొండపైన వీరంగం సృష్టించాడు. ఎవరికి ఎంత మందు కావాలంటే అంత అమ్ముతాడంట. కూటమి ప్రభుత్వంలో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ వీడియోనే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో బెల్టు షాపుల ద్వారా మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. ఇప్పుడది తిరుమలకు కూడా చేరింది. దేవుడా.!’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
Similar News
News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
News March 15, 2025
SKLM: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు అమలు చేయాలి’

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్‌లతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు.
News March 15, 2025
జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.