News December 20, 2025
తిరుమలలో చనిపోయాడు.. ఇతను మీకు తెలుసా?

తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి హఠాన్మరణానికి గురయ్యాడు. సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తికి డిసెంబర్ 17న కళ్యాణకట్ట షెడ్ సమీపంలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహం ప్రస్తుతం అశ్విని ఆసుపత్రి మార్చురీలో ఉంది. సమాచారం తెలిసిన వారు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 23, 2025
నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి: అదనపు డీసీపీ

శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేసుల పరిశోధనలో నాణ్యతను పెంచి FIR నుంచి అంతిమ రిపోర్ట్ వరకు ఉండవలసిన మెలుకువల గురించి క్షుణ్ణంగా వివరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు,టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
News December 23, 2025
996 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

<
News December 23, 2025
కదిరి: గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలపల్లిలో గర్భిణిపై దాడి చేసిన <<18637801>>వైసీపీ<<>> కార్యకర్త అజయ్ దేవ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున టపాసులు పేల్చుతుండగా వద్దని కోరిన గర్భిణి సంధ్యారాణిపై అజయ్ దాడి చేశాడు. ఆమెను కాలుతో తన్నడంతో అస్వస్థతకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.


