News January 1, 2026
తిరుమలలో టోకెన్లు లేకపోయినా రూములు

తిరుమలలో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గదుల కేటాయింపులో 7రోజుల పాటు స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఎంబీసీ, టీబీసీ, పద్మావతి విచారణ కార్యాలయంలో టోకెన్లు కలిగిన భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. తాజాగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా సీఆర్వో కార్యాలయం వద్ద గదులు కేటాయించనున్నారు.
Share It.
Similar News
News February 20, 2026
ఆర్టీఐ యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరు: హైకోర్టు

రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. RTI యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు కాంత కుమావత్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఏ విధమైన ప్రజాప్రయోజనం లేని సందర్భాల్లో సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక వ్యక్తిగత అంశం. RTI పరిధిలోకి రాదు. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదు’ అని న్యాయస్థానం పేర్కొంది.
News February 20, 2026
జగిత్యాలలో ఐపీఆర్‌పై అవగాహన కార్యక్రమం

జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కుల(IPR)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ MSME ఇన్నోవేటివ్ పథకం కింద ఐపీఆర్ ప్రాముఖ్యత, పేటెంట్లు, ట్రేడ్‌మార్కుల వినియోగంపై నిపుణులు వివరాలు వెల్లడించారు. MSME పథకాలు, మహిళా వ్యాపారవేత్తలకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, వ్యాపార ఆసక్తిగలవారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
News February 20, 2026
ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్: కేంద్రమంత్రి

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్ అయిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సదస్సుకు ఐదు లక్షల మందికిపైగా విజిటర్స్ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలికవసతుల్లో $250 బిలియన్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా డేటా సెంటర్స్, సెమీకండక్టర్ ఫెసిలిటీస్‌కు సంబంధించిన పెట్టుబడులే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ మిషన్ 2.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.


