News February 7, 2025

తిరుమలలో దంపతుల ఆత్మహత్య

image

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్‌లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 7, 2025

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 7, 2025

గురుకులాలు, హాస్టళ్లకు నిధులివ్వండి: మంత్రి స్వామి

image

AP: PM-AJAY పథకం కింద ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110cr విడుదల చేయాలని కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రామ్‌దాస్ అథవాలేను మంత్రి స్వామి కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన 75 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.245cr, గురుకులాల్లో మౌలిక వసతులకు రూ.193cr.. SC, ST అట్రాసిటీ బాధితులకు రూ.95.84cr, తదితరాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

News February 7, 2025

ఆత్కూరులో మైనర్ బాలిక సూసైడ్

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక మనస్తాపం చెంది యాసిడ్ తాగింది. దీంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు గన్నవరం ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

error: Content is protected !!