News September 13, 2025

తిరుమలలో మొబైల్ ఫోన్ల దొంగ అరెస్టు

image

తిరుమలలో శ్రీవారి భక్తుల మొబైల్ ఫోన్లను దొంగలించే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.3.5 లక్షల విలువ గల 15 మొబైల్ ఫోన్లు, 20 గ్రా. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. భక్తుడి ముసుగులో తరచుగా తిరుమల వస్తూ సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దొంగిలించే వాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెట్టు కిశోర్ రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు అతడిని రిమాండ్‌కు తరలించారు.

Similar News

News September 13, 2025

ఈమె తల్లి కాదు.. రాక్షసి

image

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.

News September 13, 2025

HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.

News September 13, 2025

HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

image

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.