News August 22, 2024

తిరుమలలో వివిధ ప్రత్యేక దర్శనాలు రద్దు

image

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వివిధ ప్రత్యేక దర్శనాలు కూడా అక్టోబరు 3నుంచి 12వ తేదీ వరకు రద్దయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు భక్తులు అధికంగా వచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

Similar News

News February 1, 2026

జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

image

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 1, 2026

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

image

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.

News February 1, 2026

చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

image

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.