News March 27, 2024
తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్లో జరగనున్న విశేష పర్వదినాలు ఇలా ఉంటాయి. 5న శ్రీ అన్నమాచార్య వర్ధంతి, 7న మాస శివరాత్రి, 8న సర్వ అమావాస్య పూజలు చేశారు. 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 11న మత్స్యజయంతి జరుగుతుంది. 17న శ్రీరామనవమి ఆస్థానం, 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం, 19న సర్వ ఏకాదశి, 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు నిర్వహిస్తారు.
Similar News
News September 28, 2025
చిత్తూరు: ‘రేపు కలెక్టరేట్లో గ్రివెన్స్ డే’

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

చిత్తూరు: కాన్పులు చేయలేక చేతులెత్తేశారు.!

జిల్లాలోని 48 PHCలో ఆగస్టులో కేవలం 53 కాన్పులే జరగాయన్న దారుణం శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో వెల్లడైంది. GDనెల్లూరు, శాంతిపురం, రొంపిచర్ల, విజయపురం, పులిచర్ల, కల్లూరు PHCలలో కనీసం ఒక్క కాన్పు కూడా నమోదు కాలేదు. అరకొర వసతులు, సిబ్బంది నిర్లక్ష్యంతో చాలా కేసులు చిత్తూరుకు రెఫర్ అవుతున్నా వాటిలో ఎక్కువగా అంబులెన్స్లలోనే కాన్పులు అవుతున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.