News April 1, 2025

తిరుమలలో వైఫల్యాలపై PMకి లేఖ

image

తిరుమలలో వరుస భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం, నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లడం, మతిస్థిమితం లేని వ్యక్తి బైక్‌పై తిరుమల కొండపైకి వెళ్లిన ఘటనలను లేఖలో పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

image

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.

News November 6, 2025

నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

image

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్‌లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News November 6, 2025

తిరుపతి, చిత్తూరు జిల్లాలో మార్పులు..!

image

నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. నగరి డివిజన్‌లోని కార్వేటినగరం, పాలసముద్రం, పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులో కలపనున్నారు. పుంగనూరును మదనపల్లె లేదా పీలేరు డివిజన్‌లో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. వెదురుకుప్పం, కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్‌ మీద చర్చ జరగలేదు. గూడూరును నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు.