News September 14, 2025
తిరుమలలో 15న సిఫార్సు లేఖలు రద్దు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజన ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16న ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులకు తప్ప మిగతా వీఐపీలకు బ్రేక్ దర్శనాలు నిలిపివేసింది. 15న సిఫార్సు లేఖల ద్వారా దర్శనాలను సైతం రద్దు చేసినట్లు పేర్కొంది. భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Similar News
News September 14, 2025
బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

UKలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరఫున జైస్మిన్ లాంబోరియా ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు.
News September 14, 2025
ఏలూరు: DSPల పనితీరుపై IG సమీక్ష

ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రొబేషనరీ DSPల పనితీరుపై సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. లాండ్ ఆర్డర్ విభాగంలో నిర్వర్తించిన విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి అనుభవాలను ఆలకించి తగిన సూచనలు సలహాలు తెలియచేశారు. సమర్థవంతమైన అధికారులుగా ఎదిగి ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని IG ఆకాంక్షించారు. ఏలూరు SP, కోనసీమ SP, తదితరులు పాల్గొన్నారు.
News September 14, 2025
మెదక్: లోక్ అదాలత్‌లో 2,446 పోలీస్ కేసుల పరిష్కారం: ఎస్పీ

జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 2,446 పోలీసు కేసులు రాజీ కుదిరినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు లోక్ అదాలత్‌లో 106 సైబర్ క్రైమ్ కేసులలో రూ. 24,19,680 బాధితుల ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకు నోడల్ అధికారులకు ఆర్డర్ కాపీలు పంపించడం జరిగినట్లు వివరించారు.