News July 15, 2024

తిరుమలాయపాలెం: నాలుగు డెంగ్యూ కేసులు

image

తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లిలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. గ్రామంలో 100 మందికి పైగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా.. పారిశుద్ధ్య లోపమే కారణమని స్థానికులు అంటున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్న వారిలో ఇప్పటి వరకు 9 మందికి డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ కాగా, ఆదివారం తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News October 8, 2024

సింగరేణి కార్మికులకు దసరా విందు ఏర్పాటు చెయ్యండి: డిప్యూటీ సీఎం భట్టి

image

సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేయాలని డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు బోనస్ అందజేశామని, సింగరేణిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యక్రమాలను ఎల్ఈడీ తెరల ద్వారా తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News October 8, 2024

పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై కామెంట్ చేయండి?

image

KMM జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి హేమాహేమీలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది తర్వాత రాష్ట్ర స్థాయిలో పేరొందారు. 1999,2004లో సంబాని చంద్రశేఖర్, 2009,2014లో రాంరెడ్డి వెంకటరెడ్డి, ఆయన మృతితో వచ్చిన బైఎలక్షన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, 2018లో కందాల ఉపేందర్ రెడ్డి, 2024లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. కాగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎవరు బెస్టో కామెంట్ చేయండి.

News October 8, 2024

ఖమ్మం: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్

image

ఖమ్మం జిల్లా అధికారులపై కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఫైర్ అయ్యారు. గ్రీవెన్స్ డేలో ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన విజ్జుదేవి ఉద్యోగానికి కుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. సమయానికి తహశీల్దార్‌ స్వామి మంజూరు చేయకపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. ‌ఈవిషయాన్ని ఆమె కలెక్టర్ దృష్టికి తేగా ప్రజాసమస్యలు పరిష్కారించడానికి ఉన్నారా.. సమస్యలు సృష్టించడానికి ఉన్నారా అంటూ తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.