News November 29, 2025

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో 12 మందిని నిందితులుగా చేర్చాలని సిట్ అధికారులు నెల్లూరు ACB కోర్టును కోరారు. వీరిలో 7 మంది TTD ఉద్యోగులతోపాటు మరో ఐదుగురు ఉన్నారు. వీరంతా 2018 నుంచి 2024 వరకు ప్రొక్యూర్ మెంట్‌లో పని చేసినవారు. ఈ కేసులో SV గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డి పేరు కూడా ఉండడం గమనార్హం.

Similar News

News December 1, 2025

VKB: ప్రజావాణికి 16 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్

image

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కారం చూపుతున్నట్లు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను శాఖల వారీగా అధికారులు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News December 1, 2025

ఇన్‌స్టాగ్రామ్‌‌తో పిల్లల్ని పెంచడం కరెక్టేనా?

image

పిల్లల ఫుడ్ నుంచి హెల్త్ వరకు పేరెంట్స్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌నే ఫాలో అవుతున్నారు. ఈ Instagram పేరెంటింగ్ కొన్నిసార్లు ఫర్వాలేదు కానీ, ప్రతిసారీ, ప్రతి కిడ్‌కూ సెట్ కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బేబీ లైఫ్, పరిస్థితులు, బిహేవియర్ ప్రత్యేకం కాబట్టి మన పెద్దలు, డాక్టర్ల సలహా పాటించడం మంచిదని సూచిస్తున్నారు. IG టిప్స్‌తో రిజల్ట్స్ తేడా అయితే మనం ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.

News December 1, 2025

జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

image

జి.జి.కళాశాలలో శనివారం నుండి మొదలైన (స్వ.ప్ర.) డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. సోమవారం1664 మంది విద్యార్థులకుగాను 57మంది గైర్హాజరయ్యారు.1607మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తదితర పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.ఎస్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.