News August 9, 2024

తిరుమల చేరుకున్న గోవా రాష్ట్ర మంత్రి 

image

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్ధం గోవా రాష్ట్ర మంత్రి విశ్వజిత్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహాల వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారులు పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బసచేసి శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేకం సేవలో దర్శించుకోనున్నారు.

Similar News

News December 14, 2025

మిస్ ఆంధ్రాగా చిత్తూరు అమ్మాయి

image

అందాల పోటీల్లో చిత్తూరు జిల్లా అమ్మాయి మెరిసింది. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ దంపతులు బెంగళూరులో సెటిల్ అయ్యారు. వాళ్ల కుమార్తె జీవిరెడ్డి సహస్ర రెడ్డి(15) మోడల్‌గా రాణిస్తున్నారు. ఇటీవల విజయవాడలో APఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎన్విరాన్‌మెండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్నారు. టీనేజ్ విభాగంలో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News December 13, 2025

చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

News December 13, 2025

చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

image

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.