News March 26, 2025

తిరుమల: టీటీడీ ట్రస్టులకు భారీగా పెరిగిన విరాళాలు

image

గడిచిన 9 రోజుల్లో వివిధ ట్రస్ట్‌లకు విరాళంగా రూ. 26.85 కోట్లు అందినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా తెలిపారు. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందినట్లు చెప్పారు. తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ 1.01 కోట్లు విరాళం అందినట్లు చెప్పారు.

Similar News

News October 26, 2025

గుంటూరు GMCలో మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో గుంటూరు నగరంలో తలెత్తే సమస్యలపై ఫిర్యాదుల కోసం జీఎంసీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 0863-2345103, వాట్సాప్ నంబర్ 9849908391ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు.

News October 26, 2025

చిత్తూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

News October 26, 2025

SRPT: కాంగ్రెస్ విధేయుడు అన్నెపర్తికే DCC పగ్గాలు?

image

సూర్యాపేట DCC అధ్యక్ష పదవి తుంగతుర్తికి చెందిన విధేయుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌కే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 30-40 ఏళ్లు కాంగ్రెస్‌ను నమ్ముకుని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజా పోరాటాలు చేయడంలో ముందున్నారు.. పదేళ్లు అధికారం లేకున్నా పార్టీని వీడకుండా పనిచేసిన ఆయనకు పగ్గాలు అప్పగిస్తే కలసివస్తుందని అభిప్రాయపడుతున్నాయి. తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లో ఉంది.