News October 15, 2025
తిరుమల నుంచి 187 మంది తరలింపు

తిరుమలలో యాచకులు, అనాధికారిక హాకర్ల పై టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 187 మందిని గుర్తించి తిరుమల నుంచి కిందకి తరలించారు. వివిధ ప్రాంతాలను భక్తుల కోసం శుభ్రపరిచారు. హోటల్స్, టీ షాపులు వద్ద పారిశుద్ధ్యం పై సూచనలు చేశారు.
Similar News
News October 15, 2025
సిద్దిపేట: ఆశావహుల్లో ఆందోళన..!

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆశావహుల్లో ఆందోళన పెరిగింది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలవాలని ఉత్సాహంగా ముందస్తు కార్యక్రమాలు చేపట్టిన వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికలు వాయిదా పడడంతో, ఖర్చులు పెట్టి మళ్లీ పోటీ చేసినా తర్వాత ఎన్నికలు నిలిచిపోతే పరిస్థితి ఏంటంటూ కొందరు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గిపోయింది.
News October 15, 2025
తిరుచానూరులో మహిళా జమేదార్‌పై చర్యలేవి..?

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భద్రత కల్పించాల్సిన సిబ్బంది దురుసు ప్రవర్తన భక్తుల పాలిట శాపంగా మారింది. మంగళవారం ఓ మహిళా విజిలెన్స్ జమేధార్ భక్తురాలిపై చేయి చేసుకుంది. గతంలో కూడా ఆమె ఓ దివ్యాంగుడి పట్ల దురుసుగా ప్రవర్తించారట. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
News October 15, 2025
కామారెడ్డి జిల్లా వాతావరణం UPDATE

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో అక్కడక్కడ వర్షపాతం నమోదైంది. సోమూర్‌లో 43.8 మి.మీ నమోదు కాగా.. బిచ్కుందలో 10.3, మేనూర్ 6, కొల్లూరు 3.5, జుక్కల్, పుల్కల్ 3, బొమ్మన్ దేవిపల్లి 2.8, బీర్కూర్ 2.3, పెద్ద కొడప్గల్ 1.5, నస్రుల్లాబాద్‌లో 1 మి.మీ రికార్డ్ అయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సోమూర్‌లో 33.1°C, కనిష్ఠ ఉష్ణోగ్రత లచ్చపేటలో 20.8°C నమోదయ్యాయి.