News December 27, 2025

తిరుమల పరకామణి చోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

తిరుమల పరకామణీ చోరీ కేసు నిందితుడు రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై నివేదికను హైకోర్టుకు ఏసీబీ డీజీ సమర్పించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోని తాజా పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది. జనవరి 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

Similar News

News December 27, 2025

కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

image

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

News December 27, 2025

అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

image

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.

News December 27, 2025

VKB: జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు

image

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో గుబులు పుడుతోంది. దీంతో అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ టీచర్‌లకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయనున్నారు. జనవరి 3 నుంచి పరీక్షలు జరుగుతాయి.