News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

image

తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె. శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Similar News

News December 23, 2025

విజయవాడలో ఏఐ వాషింగ్ మెషీన్ల విడుదల

image

విజయవాడలోని సోనోవిజన్‌లో ఎల్‌జీ ఇండియా అత్యాధునిక ‘ఏఐ డీడీ 2.0’ టెక్నాలజీతో 10 కొత్త వాషింగ్ మెషీన్ మోడళ్లను విడుదల చేసింది. సోనోవిజన్ ఎండీ పి.భాస్కర మూర్తి, ఎల్‌జీ ప్రతినిధులు వీటిని ఆవిష్కరించారు. ఈ మెషీన్లు బట్టల బరువు, మురికిని గుర్తించి వాష్ సైకిల్‌ను నిర్ణయిస్తాయని, స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా ఫోన్‌తో నియంత్రించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

News December 23, 2025

పల్స్ పోలియో 99.33 శాతం కవరేజ్: DMHO

image

గుంటూరు జిల్లాలో DEC 21, 22, 23 తేదీల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యంగా నిర్ణయించిన 2,14,981 మంది పిల్లలలో 2,13,539 మందికి పోలియో చుక్కలు వేయడంతో 99.33 శాతం కవరేజ్ సాధించినట్లు DMHO డా.విజయలక్ష్మి తెలిపారు. ఇంకా 1,442 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. మిగిలిన పిల్లలకు, టీకాలు వేసే క్రమంలో పోలియో చుక్కలు పంపిణీ ఏఎన్ఎంల ద్వారా వేయడం జరుగుతుందని DMHO తెలిపారు.

News December 23, 2025

అమరావతి బ్రాండ్‌కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

image

అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.