News December 28, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను TTD ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి Jan 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, Jan 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.
Similar News
News February 11, 2026
నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 FYకి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.
News February 11, 2026
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News February 11, 2026
శివుడు లేని చోటు గలదా?

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.


