News March 1, 2026
తిరుమల: మరో రెండు రోజుల్లో ఏకసభ్య కమిషన్

కల్తీ నెయ్యి ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ మరో రెండు రోజుల్లో తిరుమలకు రానున్నట్లు సమాచారం. కమిషన్ వచ్చాక చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం టీటీడీ అధికారులు చర్చించుకున్నారు. వారు కార్యాలయంతో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలు, వాటికి సంబంధించిన ఫైల్స్ తదితర వాటిని పరిశీలిస్తారు. కేసులో ప్రమేయం ఉన్న వారిని విచారించే అవకాశం కూడా ఉంది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
Similar News
News March 6, 2026
అమెరికా చేతిలో గల్ఫ్ దేశాలు బలి!

మిడిల్ ఈస్ట్‌లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్‌లకు నష్టం వాటిల్లుతోంది.
News March 6, 2026
సివిల్స్ ఫలితాల్లో జనగామ యువకుడి సత్తా

సివిల్స్ ఫలితాల్లో జనగామ జిల్లాకు చెందిన భరత్ నాయక్ సత్తా చాటారు. 2023లో ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటి మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
News March 6, 2026
ఏసీలు కొనేవారికి షాక్

వేసవి ప్రారంభంలోనే ఏసీ ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే LG, హిటాచీ దాదాపు 5-7 శాతం రేట్లను పెంచాయి. రానున్న 3-10 రోజుల్లో బ్లూ స్టార్, వోల్టాస్, ఇతర బ్రాండ్లు 10-15 శాతం మేర ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. పెరిగిన ముడి సరకు ధరలను భర్తీ చేసుకోవడానికి కంపెనీలు వేసవి డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ముఖ్యంగా AC కంప్రెసర్లు, కాయిల్స్‌లో వాడే <<19232225>>రాగి రేటు<<>> భారీగా పెరిగిన విషయం తెలిసిందే.


