News February 11, 2026

తిరుమల: మార్కెటింగ్ విభాగంలో ఓ అధికారి పాత్ర..?

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో సిట్ లేఖపై మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకుంది. లంచాలు తీసుకుని నెయ్యి ట్యాంకులను వదిలేసినట్లు నిందితులు వద్ద లభించిన డైరీలో ఉండడంతో ఇద్దరినీ విచారించింది. సెక్రటరీని సస్పెండ్ చేసి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించారు. ఇతను ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా, అతని వెనుక అదే విభాగానికి చెందిన ఓ అధికారి ఉన్నారని సమాచారం. అతనిపై ఎలాంటి చర్యలు, పేరు లేకపోవడం గమనార్హం.

Similar News

News February 13, 2026

క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్న

image

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటు, మార్గదర్శకాలు, రోగుల అర్హత ప్రమాణాలపై కేంద్ర ఆరోగ్య శాఖను వివరణ కోరారు. కేంద్ర సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ.. అవసరమైన సదుపాయాలు ఉన్న ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు‌.

News February 13, 2026

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఎల్లుండి ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక కొలంబోకు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 50-65% ఉందని Accuweather అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని సమాచారం. ఈనెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక IMD చెప్పడం గమనార్హం.

News February 13, 2026

జమ్మికుంట మార్కెట్‌కు 2 రోజులు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు రైతులు 29 వాహనాల్లో 221 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.6,200 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.50 పెరిగింది.