News February 4, 2025
తిరుమల: రథసప్తమి.. పోలీసులకు ఎస్పీ సూచనలు

TTD ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని జిల్లా హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి తిరుమల ఎస్.వి హై స్కూల్ గ్రౌండ్‌లో పలు సూచనలు చేశారు. పోలీసులు భక్తులతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. రథసప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News February 28, 2026
సిద్దిపేట: హై కోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పుల్ల కార్తీక్ శనివారం సిద్దిపేట పర్యటనకు విచ్చేశారు. హరిత మినర్వా హోటల్‌లో కలెక్టర్ కె.హైమావతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా కోర్టులో న్యాయశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి న్యాయపరమైన అంశాలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జడ్జి పాల్గొన్నారు.
News February 28, 2026
ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్

గద్వాల జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిట్టింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News February 28, 2026
NRPT: మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ

మీసేవ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మొబైల్ యాప్‌ను విధిగా వినియోగించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాప్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


