News April 4, 2024

తిరుమల: రేపు డయల్ యువర్ ఈవో

image

టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో ఏవీ ధర్మారెడ్డితో ఫోన్లో(0877-2263261) నేరుగా మాట్లాడి తెలపవచ్చని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 2, 2025

చిత్తూరు: ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పెద్దిరెడ్డిదే హవా?

image

గతంలో సీమను తన కనుసన్నల్లో శాసించిన పెద్దిరెడ్డి హవానే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సాగుతోందట. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, జీడీ నెల్లూరు, పీలేరు, పలమనేరులో బాహాటంగానే పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలో చేరి ఆయనకు సహకరిస్తున్నారట. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకుని గ్రావెల్, ఇసుక దందా, అక్రమం మైనింగులకు పాల్పడుతున్నట్లు తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

News October 2, 2025

చిత్తూరు: ఎనిమిది KGBVల్లో సీసీ కెమెరాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో బాలికల భద్రత నిమిత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 8 కేజీబీవీలకు సీసీ కెమెరాలను మంజూరు చేసిందన్నారు. వీటిల్లో ప్రత్యేక బృందం సీసీ కెమెరాలను అమర్చుతారన్నారు.

News October 2, 2025

రూ.200 కొట్టు.. పెన్షన్ నగదు పట్టు.!

image

పలమనేరులో ప్రభుత్వ పథకాల పంపిణీలో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వృద్ధులు, మంచాన ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొందరు ఉద్యోగులు లబ్ధిదారుల నుంచి రూ.200 తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఇవ్వని వారిని తిప్పించుకోవడం, ఆలస్యం చేయింయడం వంటివి చేస్తున్నారట. దీనిపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరారు. మీ ఏరియాలో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతోంది?